నీతో నా జీవితం సంతోషమే
neethoo naa jeevitham santhoossamee
🎵 TG-1455🌐 Telugu
పల్లవి
నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే (2) నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా… భీకర ధ్వనిగలా మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా||
1వ చరణం
సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా||