నీతో నుండని బ్రతుకు
neethoo nundani brathuku
🎵 TG-1436🌐 Telugu
పల్లవి
నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు (2) నీదు స్వరము వినకనే నేను నిను విడచి తిరిగితి నేను నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2) ||నిను||
1వ చరణం
నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా ||నీతో||
2వ చరణం
నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా ||నిను||