నీవే నా ప్రాణం సర్వం
neevee naa praannam sarvam
🎵 TG-1688🌐 Telugu
పల్లవి
నీవే నా ప్రాణం సర్వం నీవే నా ధ్యానం గానం యేసయ్యా నీవే ఆధారం (2) నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.. హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) ||నీవే||
1వ చరణం
నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది నీ రాకకే కదా నేనెదురు చూచునది నీవలె ఉందును నీలో వసించెదను అండా దండా కొండా నీవయ్యా నాకున్న లోకం అంతా నీవయ్యా నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా||
2వ చరణం
నా కాపరి నీవే నా ఊపిరి నీవే నా దారివి నీవే నా మాదిరి నీవే నీవలె ఉందును నీ వెంట సాగెదను