నీవే నా సర్వము నీవే
neevee naa sarvamu neevee
🎵 TG-1689🌐 Telugu
పల్లవి
నీవే నా సర్వము నీవే నాకున్నావు నీవే నా సర్వము అన్నిటిలో నీ జీవం నా కొరకు ఇచ్చినందున (2) తేనె కంటే మధురము యేసయ్యే నాకు మాధుర్యము రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును ||తేనె||
1వ చరణం
నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే కదా నా ఆధారము నీ పాదములకు మ్రొక్కెదను నీ నామం పాడి స్తుతించెదను (2) ||తేనె||
2వ చరణం
నీవే పరిహార నీవే పరమౌషధం నీవే నా శక్తివి నా యేసయ్యా కల్వరి సిలువపై బాలి అయితివే నే బాగుపడితిని గాయములచే నీవే నా కీర్తివి నీవే నా అతిశయం నీవే నా మేలులు నా యేసయ్యా నీ పాద సేవయే చేయుటయే నా హృదయములున్న వాంఛయేగా