నీవే నా స్నేహము
neevee naa sneehamu
🎵 TG-1695🌐 Telugu
పల్లవి
నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము నీవే ఆధారము – నీవే నా ఆనందము నీ ప్రేమ నాలో పదిలము నీలోనే సాక్ష్యమే సంతోషము (2) సర్వోన్నతుడా నీకే మహిమ పరమ తండ్రి నీకే ఘనత (2) ||నీవే||
1వ చరణం
నా జీవితాంతం నిన్నే పొగడెదను నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే నా దేవుని మందిరములో నివసించెదను నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – (2) ||సర్వోన్నతుడా||
2వ చరణం
నా బలహీన స్థితిలో గతివి నీవైతివే నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే కృంగిన నా హృదయమును లేవనెత్తితివి అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా –