నీవే నీవే కావాలి ప్రభువుకు
neevee neevee kaavaali prabhuvuku
🎵 TG-2890🌐 Telugu
పల్లవి
నీవే నీవే కావాలి ప్రభువుకు నేడే నేడే చేరాలి ప్రభువును (2) ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే||
1వ చరణం
నీ సృష్టికర్తను నీవు విడచినా నీకిష్టమైన రీతి నీవు నడచినా దోషివయినా ద్రోహివయినా దేవుని చెంత – చేరిపుడైనా (2) ||ఈ కాలం||
2వ చరణం
పాపాలతో నీవు పండిపోయినా ప్రేమించువారు లేక కృంగిపోయినా యేసుని చరణం – పాప హరణం యేసుని స్నేహం – పాపికి మోక్షం నీటి బుడగలాంటిది నీ జీవితం గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం అధికుడవైనా అధముడవైనా ఆయన ప్రేమ – కోరిపుడైనా