నీవే నీవే.. నన్ను పిలిచిన

neevee neevee.. nannu pilichina

🎵 TG-2217🌐 Telugu
పల్లవి

నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము (2) స్తుతి గాన సంపద నిన్ను చేరాలని నా దీన మనస్సు నీవే చూడాలని ప్రయాసతో ప్రయాణమైతిని ||నీవే||

1వ చరణం

నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదు నీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథం నా కొరకే పంపావయ్యా ఏ చోటనైనా – ఏ పల్లెనైనా నీ పలుకే బంగారమాయెనయా నోవాహును నడిపిన – నావికుడు నీవేనయ్యా సంద్రాన్ని చల్లార్చిన – ఆ శక్తి నీదేనయ్యా దావీదు ప్రార్ధన – ఆ యోబు వేదన కనిపెట్టి చూసావయ్యా నా దుఃఖ భారం – నా శాప భారం నీలోనే కరగాలయ్యా

Report Error