నీవు చేసిన ఉపకారములకు నేనేమి

neevu cheesina upakaaramulaku neeneemi

🎵 TG-1368🌐 Telugu
పల్లవి

నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా ||నీవు చేసిన||

1వ చరణం

వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని ||ఏడాది||

2వ చరణం

మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2)       ||ఏడాది||

3వ చరణం

ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా

Report Error