నీవు లేని క్షణమైనా ఊహించలేను
neevu leeni kssannamainaa uuhinchaleenu
🎵 TG-2082🌐 Telugu
పల్లవి
నీవు లేని క్షణమైనా ఊహించలేను నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2) నీవే నా కాపరి – నీవే నా ఊపిరి నీవే నా సర్వము యేసయ్య నీతోనే జీవితం – నేనే నీకంకితం గైకొనుమో నన్ను ఓ దేవా … ||నీవు లేని||
1వ చరణం
శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా నను ధైర్యపరిచె నీ వాక్యం సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా నను మునగనీయక లేవనెత్తిన నీవే నా కండగా – నాతో నీవుండగా భయమన్నదే నాకు లేదూ సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా వందనము నీకే ఓ దేవా శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా అవి నన్ను కాల్చజాలవుగా దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా నాకేమాత్రం హాని చేయవుగా వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన వేదనలే తొలగించిన యేసయ్యా