నీవు లేనిదే నేను లేను
neevu leenidee neenu leenu
🎵 TG-2098🌐 Telugu
పల్లవి
నీవు లేనిదే నేను లేను ప్రభువా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా (2) నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము (2) ||నీవు||
1వ చరణం
గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే ఆ సిలువే నాకు శరణం నా పాప పరిహారం అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే ఆ సిలువే నాకు నిరతం నా జీవిత చిరుదీపం