నీవు తడితే తలుపు తీయనా
neevu thadithee thalupu theeyanaa
🎵 TG-2498🌐 Telugu
పల్లవి
నీవు తడితే తలుపు తీయనా ప్రభు నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు||
1వ చరణం
పాపముతో నిండియున్న నా బ్రతుకును పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా పాపములో జీవించుచున్న నాపై ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2) నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి నన్ను నడిపించగ వచ్చావయ్యా తెరిచాను నా తలుపులు రావా ప్రభు ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను నాలోన నీవుండి పోవాలి నీతోనే నడవాలి ఇక మీదట రక్షణనే కేడెము చేత పట్టి ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా స్వస్థతనే వరముల దయచేయుమా కడ వరకు పరుగెడుదును నీ బాటలో ఎల్లవేళలా నాతో ఉండి నన్ను చేయి పట్టి నడిపించు నా యేసయ్యా