నీవుంటే నాకు చాలు యేసయ్యా
neevuntee naaku chaalu yeesayyaa
🎵 TG-1336🌐 Telugu
పల్లవి
నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||నీవుంటే||
1వ చరణం
ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ ||నీ మాట||
2వ చరణం
బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము