నెరవేరుగురుతు లవి యన్నియు - పరిపూర్ణమాయె కాలంబును
neraveerugurutu lavi yanniyu - paripuurnnamaaye kaalanbunu
పల్లవి
ఇక యేసుడు ఏతెంచును - ఇది నమ్ముమా ఓ క్రైస్తవ
1వ చరణం
పెండ్లి కుమారుండుగా యేసుడు - ఏతించుచున్నాడు ఈభూమికి సిద్ధంబుకమ్ము సిద్దెలు నింపి - లేనేలేదు కాలంబిక"నెర"
2వ చరణం
కొడవలి చేబూని రైతువలె - నేతించు చున్నాడు లోకేశుడు సిద్ధంబు కమ్ము నీ పంటతోడ - లేనేలేదు కాలంబిక "నెర"
3వ చరణం
నడిరేయిలో దొంగరాక వలె - రానున్న దేసయ్య ఈరాకడ మెలకువ తోడ కనిపెట్టు సుమ్ము - లేనేలేదు కాలంబిక "నెర"
4వ చరణం
మేఘాస నాసీనుడై దేవుడు - వేవేల దూత సమూహాలతో తనవారిజేరి ప్రియమార బరము కొనిపోవ త్వరలో వేంచేయును "నెర"