నిబ్బరముతో నా యేసుకే స్తుతి
nibbaramuthoo naa yeesukee sthuthi
🎵 TG-2241🌐 Telugu
పల్లవి
నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2) యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో||
1వ చరణం
కష్టకాలమందు నాకు – కనికరము చూపెను కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా||
2వ చరణం
దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను