నీ జీవితములో గమ్యంబు ఏదో - ఒకసారి యోచింపవా

nii jiivitamuloo gamyanbu eedoo - okasaari yoochinpavaa

🎵 TG-1107💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఈ నాడే నీవు ప్రభు యేసు కొరకు - నీ హృదయ మర్పించవా?

1వ చరణం

నీ తల్లి గర్బమున నీ వుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు (2) యోచించి నావా ఏరీతి నిన్ను - నిర్మించే తన చేతులు "నీ జీవిత"

2వ చరణం

నీ లోన తాను నివసింపగోరి - దినమెల్ల చే జాచెను (2) హృదయంబు తలపు - తెరువంగ లేవా యేసు ప్రవేశింపను "నీ జీవిత"

3వ చరణం

తన చేతులందు హృదయంబు ధారల్‌ - స్రవియించె నీకోసమే (2) భరియించే శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా? "నీ జీవిత"

4వ చరణం

ప్రభు యేసు నిన్ను సంధించి నట్టి - సమయంభు ఈ నాడేగా (2) ఈ చోటు నుండి ప్రభు యేసు లేక - పోభోకుమా సోదరా "నీ జీవిత"

Report Error