నీ వాక్యమే నన్ను బ్రతికించెను

nii vaakyamee nannu bratikinchenu

🎵 TG-1109💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

భాధలలో నెమ్మది నిచ్చెను కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమైయున్న యేసు వందనమయ్యా

1వ చరణం

జిగటగల ఊభినుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) "నీవాక్య"

2వ చరణం

శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని భాణములను ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది (2) "నీవాక్య"

3వ చరణం

పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు - మహా మధురమైనది మేలిమి బంగారుకంటే మిన్నయైనది రత్న రాశులకన్న కోరతగినది (2) "నీవాక్య"

Report Error