నీ...మధిలో నను తలచు ప్రభువా
nii...madhiloo nanu talachu prabhuvaa
పల్లవి
నీ...మధిలో నను తలచు నా ప్రభువా నను తలచిన తరుణములో నా పాపము పరిహరించు - 2
1వ చరణం
ప్రాపంచిక వ్యసనములో నే చిక్కితినో ప్రభువా - 2 నను విడుదల చేయుమయా పరిశుద్ధుని చేయుమయా - 2 "నీమధిలో"
2వ చరణం
అనురాగపు వీక్షణతో నా దు:ఖము బాపుమయా - 2 ప్రియ సేవకుడను నేనై సవి చూతును విశ్రాంతి - 2 "నీమధిలో"
3వ చరణం
చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా - 2 చూపించుము నా ప్రభువా నీ స్వర్గపు మార్గమును - 2 "నీమధిలో"