నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు
niitoo samamevaru? niilaa preemincheedevaru
పల్లవి
నీలా క్షమియించెదెవరు ? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరూ? "2"
1వ చరణం
వెండి బంగారము ధన ధాన్యాలను - ఒక్కపోగేసిన నీతో సరితూగునా “2" జీవనదులన్నియూ సర్వసముద్రములు - ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా నీలా జాలిగల ప్రేమగల దేవుడేరి - నీవేగా మంచి దేవుడవు "2" " నీతో"
2వ చరణం
పలు వేధాలలోమత గ్రందాలలో - పావనేసుకన్న పరిశుద్ధుడెవరు “2" పాప పరిహారము సిలువ మరణమొంది - తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ద దేవుడెవరున్నారయ్యా - నీవేగా విమోచకుడవు "2" "నీతో"
3వ చరణం
నేను వెదకాకున్నా నాకు దొరికితివి - నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి "2" నీకు గాయాలుచేసి తరచు రేపితిని - నన్నెంతో సహించి క్షమియించితివి లోక సౌఖ్యాలన్నీ ఒక చోట - కుమ్మరించినా - నీవేగా చాలిన దేవుడవు "2" "నీతో”