నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
niitti vaagula koraku duppi aashinchunattlu
పల్లవి
నీ కొరకు నాప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా- ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా
1వ చరణం
పనికిరాని నన్ను నీవు పైకిలేపితివి క్రీస్తనే బండపైన నన్నునిలిపితివి (2) నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు "నాప్రాణమా"
2వ చరణం
అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2) కంటి పాపగ నీవు నన్ను కాచితివి కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను ఇలలో నిన్ను కొలిచెదను "నాప్రాణమా"
3వ చరణం
నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలియింతును (2) నీవు చేసిన మేళ్ళను నేనెట్లు మరతు ప్రభు నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును "నాప్రాణమా"