నీవే నన్ను కోరుకొన్నావు - నీవే నన్ను చేరుకొన్నావు
niivee nannu koorukonnaavu - niivee nannu cheerukonnaavu
పల్లవి
నీవే నన్ను విడిపించావు - నీవే నన్ను విడువనన్నావు ఎంతప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా - 2 "నీవేనన్ను"
1వ చరణం
నీ అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు - నీ కృపలో నన్ను ఎన్నుకొన్నావు నీ రాజ్యములో నను దాచివుంచావు - నీ నామములో నను రక్షించావు ఎంతప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా - 2 "నీవేనన్ను"
2వ చరణం
నీ వాక్యముతో నను సుద్ధిచేసావు - నీ రక్తముతో నను కడిగివేసావు నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు - నీ ఆత్మతో నన్ను నింపివేసావు ఎంతప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా - 2 "నీవేనన్ను"