నిన్ను చూడగ వచ్చినాడురా దేవ

ninnu chuudaga vachchinaaduraa deeva

🎵 TG-2817🌐 Telugu
పల్లవి

నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2) లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను||

1వ చరణం

దేవుని కోపము నుండి తప్పించే ప్రియ పుత్రుడాయనే ముట్టుకో ముద్దు పెట్టుకో (2)        ||బెత్లెహేమను||

2వ చరణం

గుండెలో కొలువైయుండి దీవించే ధనవంతుడాయనే ఎత్తుకో బాగా హత్తుకో తోడుగ వెంటే ఉండి రక్షించే బలవంతుడాయనే చేరుకో నేడే కోరుకో

Report Error