నిరంతరం నీతోనే జీవించాలనే - ఆశ నన్నిల బ్రతికించుచున్నది

nirantaran niitoonee jiivinchaalanee - aasha nannila bratikinchuchunnadi

🎵 TG-1104💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నాప్రాణేశ్వరా యేసయ్యా - నా సర్వస్వమా...యేసయ్యా..

1వ చరణం

చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని (2) పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు- నీ రాకడకై..

2వ చరణం

నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2) పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై..

3వ చరణం

తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2) పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై.

Report Error