నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ
nirantharam neethoonee jeevinchaalanee aasha
🎵 TG-2039🌐 Telugu
పల్లవి
నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2) నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం||
1వ చరణం
చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై నీ రూపము నేను కోల్పయినా నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోని నాటితివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై