నిత్యం నిలిచేది – నీ

nithyam nilicheedi – nee

🎵 TG-2143🌐 Telugu
పల్లవి

నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా (2) నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2)     ||నిత్యం||

1వ చరణం

మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు నీకెవరూ సాటే రారయ్యా నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా

Report Error