నూతనమైనది నీ వాత్సల్యము

nuuthanamainadi nee vaathsalyamu

🎵 TG-2823🌐 Telugu
పల్లవి

నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2)         ||సన్నుతించెదను||

1వ చరణం

నా హీన దశలో – నీ ప్రేమ చూపి – పైకి లేపినావు ఉన్నత స్థలములో – నను నిలువబెట్టి – ధైర్యపరచినావు మరువని దేవుడవు – నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు నీ రెక్కల క్రింద – నను దాచినావు – ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా – నీవుండినావు – సంరక్షించావు ప్రేమించే దేవుడవు – తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు

Report Error