ఓ క్రైస్తవ యువకా - నిజమంతయు గనుమా
oo kraistava yuvakaa - nijamantayu ganumaa
పల్లవి
నీ బ్రతుకంతా మారుటమేలు - కోరుము జీవమునే -2
1వ చరణం
పాపపు చీకటి బ్రతుకేలా - శాపము భారము నీకేలా పావన యేసుని పాదము జేరిన - జీవము నీ దగురా "ఓ"
2వ చరణం
మారిన జీవిత తీరులలో - మానక నీప్రభు సేవకురా మహిమ కిరీటము మనకొసగును - ఘనమే నీ దగురా "ఓ"
3వ చరణం
భయపడి వెనుకకు పరుగిడక - బలమగు వైరిని గెలిచెదవా బలమగు ప్రభుని వాక్యము నమ్మిన - గెలుపే నీదగురా "ఓ"