ఓ ప్రభువా… ఓ ప్రభువా
oo prabhuvaa… oo prabhuvaa
🎵 TG-2766🌐 Telugu
పల్లవి
ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
1వ చరణం
దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (4) ||ఓ ప్రభువా||
2వ చరణం
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో నన్ను నీవు మరువని దేవా