ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా

oo yaathrikudaa oohoo yaathrikudaa

🎵 TG-2158🌐 Telugu
పల్లవి

ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా.. ఓ బాటసారి ఓహో బాటసారి జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది (2) అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2)         ||ఓ యాత్రికుడా||

1వ చరణం

పుట్టగానే తొట్టెలో వేస్తారు గిట్టగానే పెట్టెలో మూస్తారు జాగు చేయక కాటికి మోస్తారు ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ.. బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు ఏడిపిస్తూ సమాధికి పోతావు కూడబెట్టినవి మోసుకు పోలేవు ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ.. జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే మరణము ఒక నిద్ర యేసునందు అంతము అది కాదు క్రీస్తునందు మృతులు లేచుట స్థిరము యేసునందు నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ.. నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము

Report Error