పాడనా మౌనముగానే స్తుతి కీర్తన

paadanaa maunamugaanee sthuthi keerthana

🎵 TG-2698🌐 Telugu
పల్లవి

పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2) యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే (2)         ||పాడనా||

1వ చరణం

ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నియు నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే

Report Error