పాడెద దేవా – నీ

paadeda deevaa – nee

🎵 TG-1442🌐 Telugu
పల్లవి

పాడెద దేవా – నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2) భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2)          ||పాడెద||

1వ చరణం

ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి – చెర నను విడిపించితివి ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి సత్యస్వరూప నిత్యనివాసి సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి అన్యుడనై నిను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి

Report Error