పదే పాడనా నిన్నే కోరనా
padee paadanaa ninnee kooranaa
🎵 TG-2533🌐 Telugu
పల్లవి
పదే పాడనా నిన్నే కోరనా – ఇదే రీతిగా నిన్నే చేరనా (2) నీ వాక్యమే నాకుండగా – నా తోడుగా నీవుండగా ఇదే బాటలో నే సాగనా – ఇదే రీతిగా నా యేసయ్య ||పదే పాడనా||
1వ చరణం
ప్రేమను పంచే నీ గుణం – జీవము నింపే సాంత్వనం మెదిలెను నాలో నీ స్వరం – చూపెను నాకు ఆశ్రయం నీవే నాకు ప్రభాతము – నాలో పొంగే ప్రవాహము నీవే నాకు అంబరం – నాలో నిండే సంబరం నాలోన మిగిలే నీ ఋణం – నీతోటి సాగే ప్రయాణం మహిమకు నీవే రూపము – మధురము నీదు నామము ఇదిగో నాదు జీవితం – ఇలలో నీకే అంకితం నీవే నాకు సహాయము – నిన్న నేడు నిరంతరం నీవే నాకు ఆశయం – నాలో నీకే ఆలయం ధరలోన లేరు నీ సమం – నీ ప్రేమధారే నా వరం