పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా
panpumu deevaa diivenalatoo - panpumu deevaa
పల్లవి
పంపుము దయచేత - పతిత పావన నామ పెంపుగ నీ సేవ - బ్రియ మొప్ప నొనరింప పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా
1వ చరణం
మా సేవనుండిన - మా వెల్తులన్నియు యేసుని కొరకు నీ వెసగ క్షమియించును
2వ చరణం
వినిన సత్యంబును - విమలాత్మ మది నిల్పి దిన దినము ఫలములు దివ్యముగ ఫలియింప
3వ చరణం
ఆసక్తితో నిన్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసికెక్కగనిచ్చి