పరమ జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ

parama jiivamu naakunivva - tirigi leechenu naatoonundda

🎵 TG-1129💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నిరంతరము నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును "యేసు చాలును చాలును - యేసు చాలును చాలును" "ఏ సమయమైన - ఏ స్థితి కైన - నాజీవితములో యేసు చాలును"

1వ చరణం

సాతాను శోధన లధికమైనా - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను

2వ చరణం

పచ్చిక బయలలో పరుండచేయున్‌ - శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్‌ - మరణ లోయలో నను కాపాడును

3వ చరణం

నరులెల్లరు నను విడిచినను - శరీరము క్రుళ్ళి కృషించినను హరించినన్‌ నా ఐశ్వర్యము - విరోధివలె నను విడచినను

Report Error