పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నీ దారిన్

paravaasini nee jagamuna prabhuvaa - nadachuchunnaanu nee daarin

🎵 TG-1129🌐 Telugu
పల్లవి

పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నీ దారిన్‌ నాగురి నీవే నా ప్రభువా - నీధరి నే చేరెదన్‌ - నేను 1 లోకమంతా నాదని యెంచి - బంధు మిత్రులే ప్రియులను కొంటిని అంతయు మోసమేగా - వ్యర్థము సర్వమును ఇలలో ||పరవాసిని|| 2 ధన సంపదలు గౌరవములు - దహించుపోవు నీ లోకములో పాపము నిండె జగములో - శాపము చేకూర్చుకొనే లోకము ||పరవాసిని|| 3 నా నేత్రములు మూయబడగా - నాదు యాత్ర ముగియునిలలో చేరుదున్‌ పరలోక దేశం - నాదు గానము యిదియే- నిత్యము ||పరవాసిని || 4 తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడనో - విరిగి నలిగి యున్నాను - నేను ||పరవాసిని||

5వ చరణం

యాత్రికుడనే ఈలోకములో - సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా - పొందితిని యేసును నేను పొందితిని ||పరవాసిని నే||

Report Error