పిలచుచున్నాడు ప్రియమైన యేసు

pilachuchunnaaddu priyamaina yeesu

🎵 TG-1313💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

పరిశుద్ధ స్థలమునకు ఎంత పాపివైనా ప్రేమించినాడు నీ జీవితమును ఏ భేదము లేక వేగమే రారండి నీవు నీ ఇంటి వారు నీతోనే ఉండువారు నిజమైన దేవుడని విశ్వసించుటకు ||పిలచు||

1వ చరణం

వెలుగై యున్నవాడు నీ చీకటి తొలగిస్తాడు మంచి గంధపు మాటలు నీ మదిలో కురిపిస్తాడు రా .. ఏ రోగివైననూ నీ పాపాలు కడుగును మారుమనస్సు పొంది ప్రేమ కలిగియుండి ప్రభుయేసు దేవుడని సాక్ష్యమిచ్చుటకు ||పిలచు||

2వ చరణం

మేడి చెట్టు ఎక్కి మరుగై యుండలేవు యేసు వచ్చు వేళ నిదురించకు ప్రభుని మరచి రా .. దిగి రమ్ము క్రిందకి ఏ అధికారివైననూ - యేసు నీ యింటికి వచ్చి నేడే రక్షణ ఇచ్చి- పరలోక రాజ్యములో నిన్ను చేర్చుటకు ||పిలచు||

Report Error