ప్రభు యేసుని వదనములో
prabhu yeesuni vadanamuloo
🎵 TG-1956🌐 Telugu
పల్లవి
ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2) పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో పరలోకముకై – చిర జీవముకై ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని||
1వ చరణం
దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును ధన పీడనతో – మృగ వాంఛలతో దిగాజారితి చావునకు యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని ఇల వేడితిని – విలపించుచును ఈడేరెను నా వినతి పరదైసున ఈ దినమే – నా ఆనందములోను పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే పరలోకమే నా – తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు