ప్రభుని గృహము ఆయన మహిమతో

prabhuni gruhamu aayana mahimathoo

🎵 TG-1948🌐 Telugu
పల్లవి

ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను (2) అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయిరి తన మహిమను మన కిచ్చుటకు యేసు ప్రభువే బలి యాయెన్ (2)        ||ప్రభుని||

1వ చరణం

కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను తండ్రి మహిమను తన సుతునిలో మనమందరము చూచితిమి ప్రభువు యింటిని నిర్మించు చుండె సజీవమైన రాళ్ళతో ఆయన మహిమ దానియందుండ తన సంకల్పమై యున్నది శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు మానవ హస్తము అందుండదు క్రయమునిచ్చి స్థలముకొనెను తాను కోరిన స్థలమదే ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి తన పునాదిని వేసెను రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా ప్రభువే సర్వము చేసెను సింహాసనముపై కూర్చున్న ప్రభువే అణగ ద్రొక్కెను శత్రువును సంపూర్ణ జయముతో ఆర్భాటముతో వెలిగించెను తన యింటిని దేవుని యిల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగివచ్చున్ దహించబడును సర్వ మలినము ఇంటిని మహిమతో నింపును

Report Error