ప్రభుని రాకడ – ఈ
prabhuni raakada – ee
ప్రభుని రాకడ – ఈ దినమే పరుగులిడి రండి – సుదినమే (2) పరమునందుండి – మన ప్రభువు ధరకు నరుగును – పాలనకై బూరశబ్దముతో – జనులారా ||ప్రభుని||
సిద్ధులగు వారిన్ – మన యేసు శుద్ధి జేయునిలన్ – పరమునకై బుద్ధిహీనులను – శ్రమలచేత బద్ధులుగ జేయున్ – వేదనతో బాధ కలిగించున్ – సాతాను స్వరముతో వచ్చున్ – అధికారి మహిమతో మరలున్ – తన దూత సూర్యచంద్రునిలన్ – తారలతో జీకటుల్ క్రమ్మున్ – ప్రభు రాక పగలు రాత్రియగున్ – త్వరపడుము మొదట లేతురు – సజీవులై ప్రభునియందుండు – ఆ మృతులు మరల అందరము – ఆ ధ్వనితో పరము జేరుదుము – ధరనుండి ధన్యులగుదుము – పరికించు వెయ్యియేండ్లు – పాలించెదరు ప్రియుని రాజ్యమున – ప్రియులు సాయం సమయమున – చేరి నెమలి కోకిలలు – రాజున్ పాడి స్తుతించును – ఆ దినము గొర్రె మేకలును – ఆ చిరుత సింహజాతులును – ఒక చోట భేధము లేక – బరుండి గరిక మేయును – ఆ వేళ కలసి మెలగును – భయపడక న్యాయ నీతులన్ – మన ప్రభువు ఖాయముగ దెల్పున్ – ఆనాడు సాక్షులుగ నిలుతుం – అందరము స్వామియేసునకు – ధ్వజమెత్తి చాటి యేసునకు – ఓ ప్రియుడా