ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
preeminchu deevudu rakssinchu deevudu
🎵 TG-1592🌐 Telugu
పల్లవి
ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు – యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం ఆహా ఎంతో ఆనందమే (2) ||ప్రేమించు||
1వ చరణం
తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు సర్వ కాలమందు జయమిచ్చును ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు