పుట్టె యేసుడు నేడు

putte yeesudu needu

🎵 TG-2153🌐 Telugu
పల్లవి

పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు ||పుట్టె||

1వ చరణం

ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2)     ||పుట్టె||

2వ చరణం

యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి

Report Error