రాజాధి రాజా రారా

raajaadhi raajaa raaraa

🎵 TG-1805🌐 Telugu
పల్లవి

రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా (2) ఓ… మేఘ వాహనంబు మీద వేగమే ఓ… మించు వైభవంబు తోడ వేగమే ||రాజాధి||

1వ చరణం

ఓ… భూజనంబులెల్ల తేరిచూడగా ఓ… నీ జనంబు స్వాగతంబునీయగా నీ రాజ్యస్థాపనంబు సేయ – భూరాజులెల్ల గూలిపోవ భూమి ఆకసంబు మారిపోవ – నీ మహా ప్రభావమున వేగ ఆ… ఆకసమున దూత లార్భటింపగా ఆ… ఆదిభక్త సంఘ సమేతంబుగా ఆకసంబు మధ్య వీధిలోన – ఏకమై మహాసభ జేయ యేసు నాధ! నీదు మహిమలోన – మాకదే మహానందమౌగ ఓ… పరమ యెరుషలేము పుణ్య సంఘమా ఓ… గొఱియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా పరమ దూతలార! భక్తులారా! – పౌలపోస్తులారా! పెద్దలారా! గొఱియపిల్ల యేసురాజు పేర – క్రొత్త గీతమెత్తి పాడరారా

Report Error