రాజులకు రాజైన ఈ మన

raajulaku raajaina ee mana

🎵 TG-1951🌐 Telugu
పల్లవి

రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని ||రాజులకు||

1వ చరణం

కరుణ గల సోదరుండై ఈయన ధరణికేతెంచెనయ్యా (2) స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు పరలోక రాజ్యమును నక్కలకు బొరియలుండే నాకాశ పక్షులకు గూళ్లుండెను ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరలు దరికి జేరిన వారిని ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము

Report Error