రాకడ సమయములో - కడబూర శబ్ధముతో
raakadda samayamuloo - kaddabuura shabdhamutoo
పల్లవి
యేసుని చేరు కొనే - విశ్వాసము నీకుందా (2) రావయ్య యేసయ్యా - వేగమే రావయ్యా - 2
1వ చరణం
యేసయ్య రాకడ సమయములో - ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? (2)
2వ చరణం
ఇంపైన దూప వేదికగా - ఏకాంత ప్రార్ధన నీకుందా? (2) యేసుని ఆశించే దీన మనస్సుందా ? (2)
3వ చరణం
దినమంతా దేవుని సన్నిదిలో- వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) యేసు నాధునితో సహవాసం నీకుందా? (2)
4వ చరణం
శ్రమలోన సహనం నీకుందా- స్తుతియించే నాలుక నీకుందా? (2) ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)
5వ చరణం
నీ పాత రోత జీవితము - నీ ఘోర హృదయము మారిందా?(2) నూతన హృదయముతో ఆరాధన నీకుందా ?(2)
6వ చరణం
అన్నిటి కన్న మిన్నగా - కన్నీటి ప్రార్ధన నీకుందా? (2) ఎల్లవేళలలో స్తుతి యాగం నీకుందా? (2)