రాతి సమాధిలో పాతిన మన

raathi samaadhiloo paathina mana

🎵 TG-2865🌐 Telugu
పల్లవి

రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై (2) దేవాలయము మూడు దినముల లోపల పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు ఆ బండ నెవరు దొర్లించకుండనే తెరువంగ బడి యుండె జై జై జై (2)         ||రాతి||

1వ చరణం

వేకువ జామున చీకటి యుండగ ఏతెంచిరా కాంతలు ఆ చోటకు ఘుమ ఘుమలాడు సుగంధాలు కొని రాగా ముందే లేచియుం డె జై జై జై ఆ మింట నున్న నా తండ్రి కడకు నేనిపుడేగెద నన్నంటకు తొలిసారి మరియకు కనిపించి పలికెను ఉల్లాసమాయెను జై జై జై

Report Error