రక్షకుండుదయించినాడు - మనకొరకు పరమ - రక్షకుండుదయించినాడు

rakssakunddudayinchinaaddu - manakoraku parama - rakssakunddudayinchinaaddu

🎵 TG-1216💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

రక్షకుండుదయించినాడు - రారెగొల్లబోయలార - తక్షణమునబోయి మన నీ రీక్షణ ఫల మొందుదము "రక్షకు"

1వ చరణం

దావీదు వంశమందు ధన్యుడు జ న్మించినాడు - దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు "రక్షకు"

2వ చరణం

గగనమునుండి దిగి ఘనుడు గబ్రియేలు దూత - తగినట్టు చెప్పి వారికి మిగుల సంతోష వార్త "రక్షకు"

3వ చరణం

వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాడు - కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు "రక్షకు"

4వ చరణం

పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రముజుట్టీ - శిశువును కను గొందురని శీఘ్రముగను దూత తెల్పె "రక్షకు"

5వ చరణం

అనుచు గొల్ల లొకరి కొకరు ఆనవాలు జెప్పుకొనుచు - అనుమతించి కడకు క్రీస్తు నందరికినీ దెల్పినారు "రక్షకు"

Report Error