రక్షకుండుదయించినాడట – మన కొరకు
rakssakundudayinchinaadata – mana koraku
🎵 TG-1817🌐 Telugu
పల్లవి
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||
1వ చరణం
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2) దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు