రక్షకుండుదయించినాడు - మనకొరకు పరమ - రక్షకుండుదయించినాడు

rakssakundudayinchinaadu - manakoraku parama - rakssakundudayinchinaadu

🎵 TG-1217🌐 Telugu
పల్లవి

రక్షకుండుదయించినాడు - మనకొరకు పరమ - రక్షకుండుదయించినాడు రక్షకుండుదయించినాడు - రారెగొల్లబోయలార - తక్షణమునబోయి మన నీ రీక్షణ ఫల మొందుదము ||రక్షకు||

1వ చరణం

దావీదు వంశమందు ధన్యుడు జ న్మించినాడు - దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు ||రక్షకు||

2వ చరణం

గగనమునుండి దిగి ఘనుడు గబ్రియేలు దూత - తగినట్టు చెప్పి వారికి మిగుల సంతోష వార్త ||రక్షకు||

3వ చరణం

వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాడు - కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకు||

4వ చరణం

పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రముజుట్టీ - శిశువును కను గొందురని శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకు||

5వ చరణం

అనుచు గొల్ల లొకరి కొకరు ఆనవాలు జెప్పుకొనుచు - అనుమతించి కడకు క్రీస్తు నందరికినీ దెల్పినారు ||రక్షకు||

Report Error