రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు
rammanu chunnaaddu ninnu prabhu yeesu
పల్లవి
వాంచతో తన కరము చాపి -రమ్మను చున్నాడు
1వ చరణం
ఎటు వంటి శ్రమలందును - ఆధరణ నీ కిచ్చునని గ్రహియించి నీవు యేసును చూచిన - హద్దు లేని ఇంపు నొందెదవు
2వ చరణం
కన్నీరంతా తుడుచును- కను పాపవలె కాపాడున్ కారు మేఘమువలె కష్టములు వచ్చినను - కనికరించి నిన్ను కాపాడున్
3వ చరణం
సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును - ఆయన నీ వెలుగు రక్షణ అయినందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము
4వ చరణం
సకల వ్యాదులను స్వస్థపరుచుటకు - శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్