రండి యుత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే

randi yuthsaahinchi paadudamu rakssanna durgamu mana prabhuvee

🎵 TG-1209🌐 Telugu
పల్లవి

రండి యుత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే

1వ చరణం

రండి కృతజ్ణత స్తోత్రముతో - రారాజు సన్నిది కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్‌ సంతోష గానము చేయుదము ||రండి ||

2వ చరణం

మన ప్రభువే మహా దేవుండు - ఘనమహాత్యము గల రాజు భూ మ్యాగాధపు లోయలలో - భూతల శిఖరములాయనవే || రండి ||

3వ చరణం

సముద్రము సృష్తించె నాయనదే - సత్యుని హస్తమే భువి జేసెన్‌ ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొర్రెలము ||రండి||

4వ చరణం

ఆ ప్రభు సన్నిది మోకరించి - మాయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనినా - నైనవి మనకెంతో మేలగును ||రండి||

5వ చరణం

తండ్రికుమార శుద్ధాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగములనౌనామేన్‌ ||రండి||

Report Error