రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా
renddee renddu daarulu ee daari kaavaaloo maanavaa
పల్లవి
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం
1వ చరణం
పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధులకోసం రాత్రి ఉండదు పగలు ఉండదు - సూర్యుడుండడు చంద్రుడుండడు దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను - యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండెను - యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||
2వ చరణం
పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం అగ్ని ఆగదు పురుగు చావదు - అగ్నిలోన ధనవంతుడు బాధపడుచుండెను అబ్రాహాము రొమ్మున లాజరును చూశాడు - లాజరును చూసి దాహమని అడిగాడు - యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||
3వ చరణం
పుడతావు నీవు దిగంబరిగ వెళతావు నీవు దిగంబరిగ - గాలి మేడలు ఎన్నో కడతావు - నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు - ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి అగ్నిలోన పడకుండా యేసు ప్రభుని నమ్ముకో ||రెండే||